పంచాంగ శ్రవణం.. షడ్రురుచుల సేవనం..
20-03-2026 12:12 AM
- వైభవంగా నూతన తెలుగు సంవత్సరాది వేడుకలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పాపన్నపేట,మార్చి19: పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు చేపట్టారు. షడ్రుచుల పచ్చడితో పాత జ్ఞాపకాలను వదిలిపెట్టి కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ పచ్చడి సేవించారు. పాత, నూతన వాహనాలకు ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
గృహాలు, వ్యాపార సముదాయాలను మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. పలు గ్రామాల్లోని దేవాలయాల వద్ద ఎడ్లబండ్ల ఊరేగిం పు అట్టహాసంగా నిర్వహించారు. సా యం త్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. నూ తన సంవత్సరంలో తమ ఆదాయ, వ్యయా లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు.




