ఆర్టీసీ బస్సు ఢీకొని.. తాత మనవడు దుర్మరణం
ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కామారెడ్డి, జూన్ 9 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో ఎక్స్‌ఎల్ వాహనంపై వెళ్తున్న తాత మనమడి ని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తాత మనవడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రాజంపేట మండలం గుండారం నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ రాజంపేట వద్ద ఢీకొనగా రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామానికిబసవన్నపల్లి రాములుమనవడు శ్రీ హర్షి టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తుండగా ఆర్టిసి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజంపేట మండల కేంద్రంతో పాటు బసవన్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తాత మనుమడు బస్సు కిందపడి మృతి చెందడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






