దేశాభివృద్ధిలో జీఎస్‌ఐ కీలకం
- భూగర్భగనుల తవ్వకాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
- పర్యావరణానికి హాని కలగకుండా గనుల తవ్వకాలు చేపట్టాలి
- కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల
ఎల్బీనగర్, జూన్ 9: భారతదేశ అభివృద్ధిలో జీఎస్‌ఐ (భారతీయ భూ వైజ్ఞానిక స ర్వే సంస్థ) పాత్ర ఎంతో కీలకమని, పారిశ్రామిక అభివృద్ధికి గనులు ఎంతో అవస రమని, పర్యావరణానికి హాని కలుగకుండా గనుల తవ్వకాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కేంద్ర బొగ్గు గను ల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
నాగో ల్ డివిజన్‌లోని జీఎస్‌ఐ శిక్షణాకేంద్రంలో సోమవారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో ‘నెక్స్ జెనరేషన్ జియోఫిజిక్స్ అన్‌లాకింగ్ ఎర్త్స్ హిడెన్ ట్రేజర్స్’ సదస్సు ప్రారం భమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి హాజరై భూ గర్భ గణాంకాల ప్రాధాన్యతను వివరించారు. అభివృద్ధి చెందుతున్న భారత భవిష్యత్తులో జీఎస్‌ఐ కీలక పాత్రను వివరిస్తూ, ఆధునిక సాంకేతికత అవసరమని సూచించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు.
పరిశోధన ఆధారిత డేటా, ఆధునిక టెక్నాలజీ ద్వారా పర్యావరణ అనుకూలమైన గనుల తవ్వకాలు ఎలా సాధ్యమ వుతాయన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భూగర్భ గణాంకాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదం చేస్తున్నాయని చెప్పారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భౌతిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు పాల్గొని నూతన సాంకేతికతలపై చర్చలు జరిపారు.
భూగర్భ సంపదల పరిశోధనలో ఉపయోగించే డేటా విజువలైజేషన్ టూల్స్, తక్కువ నష్టం కలిగించే తవ్వకాలు తదితర అంశాలపై ప్రదర్శ నలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్ డివిజన్ల కార్పొరేటర్లు చింతల అరుణా సురేం ద్రనాథ్ యాదవ్, కొప్పుల నర్సింహారెడ్డి, కల్లెం నవజీవన్‌రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసిం హారెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మేకల శిల్పారెడ్డి పాల్గొన్నారు.






