27 June, 2026 | 7:06 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

అంబేద్కర్‌లాంటి మహానీయులు అరుదుగా పుడతారు

15-04-2026 01:05 AM

పాపన్నపేట,ఏప్రిల్14: అంబేద్కర్ లాంటి మహానీయులు నూటికో, కోటికో ఒకరు జన్మిస్తారని అలాంటివారు మనదేశంలో జన్మించడం మన అదృష్టమని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహ దాతగా వ్యవహరించారు.  ఆయన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అంతకుముందు పాపన్నపేట గ్రామ శివారు నుండి హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నీరుడి వెంకటేశం, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు శ్రీధర్, శేఖర్, నాగరాజు, సిద్ధిరాం రెడ్డి, నిమ్మలగారి సిద్దు, యువజన నాయకులు నీరుడి ప్రదీప్ కుమార్, కుంటి గారి శివ, ప్రశాంత్, ప్రవీణ్, ప్రశాంత్, బట్టి మహేందర్, తదితరులున్నారు.