15 April, 2026 | 3:16 AM

గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

15-04-2026 01:04 AM

యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ

నాగలిగిద్ద, ఏప్రిల్ 14: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వోదయ ఫౌండేషన్ చైర్మన్ ఐ.ఆర్.ఎస్. సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పుస్తక పఠనం ఎంతో కీలకమని, విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు అదనపు సమాచారం కోసం గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మండలంలోని నిరుద్యోగ యువతకు ఈ గ్రంథాలయం ఒక వరమని పేర్కొన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే పఠనాశక్తి పెంపొందించేందుకు పాఠశాల ఆవరణలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మండల యువత కోసం క్రీడా సామాగ్రిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు.

మండలంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్‌ఐ కాశీపురం రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్వర రావు, మండల విద్యాధికారి మన్మథ కిషోర్, ఎస్‌ఐ కాశీపురం రామకృష్ణ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ హనుమంత రెడ్డి  నాగల్ గిద్ద సర్పంచ్ లక్ష్మి లక్ష్మణ్, సంజీవ్ పాటిల్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శంకర్, విజయేందర్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.