15 July, 2026 | 2:27 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

భారీగా తగ్గిన విదేశీ మారక నిల్వలు

16-11-2024 02:59 AM

ఒకేవారంలో 6.47 బిలియన్ డాలర్ల క్షీణత

ఆరు వారాల్లో  తరిగిపోయిన 30 బిలియన్ డాలర్లు

ముంబై, నవంబర్ 15:  దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి.  శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  నవంబర్ 8తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు భారీగా 6.477 బిలియన్ డాలర్లు తగ్గి 675.653 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. రికార్డు గరిష్ఠస్థాయి నుంచి ఫారెక్స్ రిజర్వులు తగ్గడం వరుసగా ఇది ఆరోవారం. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

విదేశీ ఫండ్స్ దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి వేగంగా నిధుల్ని వెనక్కు తీసుకుంటున్న నేపథ్యంలో  రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి వరుస 6 వారాల్లో  దాదాపు 30 బిలియన్ డాల ర్లు క్షీణించాయి. తాజాగా నవంబర్ 8తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 4.467 బిలియన్ డాలర్లు తగ్గి 585.383 బిలియన్ డాలర్ల వద్ద నిలిచా యి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కిం పులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలూ తగ్గాయ్

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు  కొద్దివారాలుగా తగ్గుతున్నప్పటికీ, నవంబర్ 8తో ముగిసిన సమీక్షావారంలో  మాత్రం 1.936 బిలియన్ డాలర్లు తగ్గి 68.817 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 60 మిలియన్ డాలర్లు తగ్గి18.159 బిలియన్ డాలర్ల వద్ద నిలినిట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 14 మిలియన్ డాలర్లు పెరిగి 4.298 బిలియన్ డాలర్ల వద్దకు తగ్గాయి.