15 July, 2026 | 1:45 PM

Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •  

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

15-07-2026 01:43 PM

బీసీ సంఘం జిల్లా నాయకులు దొగ్గలి శ్రీధర్

ముకరంపుర, జూలై 15(విజయ క్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను  ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీసీ సంఘం జిల్లా నాయకులు దొగ్గలి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే కీలకమైన సంక్షేమ పథకం అని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో అనేక విద్యాసంస్థలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం, పరీక్షలకు అనుమతి నిరాకరించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.కాబట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు.