10 April, 2026 | 2:50 AM

‘గ్రీన్ ఆశా’ వచ్చేసింది!

10-04-2026 01:14 AM
  1. నవీ ముంబైకి సురక్షితంగా చేరకున్న ఎల్పీజీ నౌక
  2. జేఎన్పీఏ పోర్టులో లంగర్ వేసిన ట్యాంకర్
  3. హోర్ముజ్‌లో భారత నావికులకు కేంద్రం కీలక అడ్వైజరీ జారీ

ముంబై, ఏప్రిల్ 9: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలతో అత్యంత  ఆంక్షలు కొనసాగుతున్న హోర్ముజ్ జలసంధిని భారతీ య జెండా కలిగిన ‘గ్రీన్ ఆశా’ ఎల్పీజీ నౌక కొన్ని రోజుల క్రితమే దాటి భారత్ వైపు కదిలింది. 15,400 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలి యం గ్యాస్ (ఎల్పీజీ)తో ఈ వస్తున్న ఈ నౌక గురువారం నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పీఏ)కి సురక్షితంగా చేరుకుంది.

జేఎన్పీఏలోని భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), ఇండియన్ ఆయి ల్ (ఐఓసీఎల్) నిర్వహిస్తున్న లిక్విడ్ బెర్త్‌లో లంగరు వేసింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రారంభమైన తర్వాత జేఎన్పీఏకు చేరుకున్న మొట్టమొదటి ఎల్పీజీ నౌక ఇదే కావడంతో దీనిని ఒక ముఖ్యమైన మై లురాయిగా అధికారులు పేర్కొన్నారు. ఈ నౌకలోని సిబ్బంది, కార్గో అంతా సురక్షితం గా ఉన్నట్లు జేఎన్పీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇటీవల ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని దాటిన ఎనిమి దో భారత నౌక ‘గ్రీన్ ఆశా’. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ దేశానికి అవ సరమైన నిత్యావసర సరుకుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించే భారత స ముద్ర రవాణా సామర్థ్యానికి ఈ సంఘటన నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నౌక రాకతో దేశీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థకు మరింత భరోసా లభించినట్లయింది.

ఇరాన్, అమెరికా -ఇ జ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం కీలక అడ్వైజరీ జారీ చేసింది.  డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనను వి డుదల చేసింది.