26 May, 2026 | 12:59 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

హోర్ముజ్‌ను దాటిన ‘గ్రీన్ శాన్వీ’

05-04-2026 12:00 AM
  1. గల్ఫ్ నుంచి 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న ట్యాంకర్
  2. జలసంధి నుంచి భారత్‌కు వచ్చిన నౌకలు ఎనిమిది

న్యూఢిల్లీ/ముంబై, ఏప్రిల్ 4: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. దీనివల్ల ప్రపంచ ఇంధన సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ఇంధన మార్కెట్లలో గందర గోళం నెలకొంది. సముద్రయాన గణాంకాల ప్రకారం, ఈ కీలక నౌకా మార్గాన్ని దాటుతున్న సరుకు రవాణా నౌకల్లో 60 శాతం ఇరాన్ నుంచి వచ్చినవే లేదా అటువైపే వెళ్తున్నవే కావడం గమనార్హం.

హోర్ముజ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఈ మార్గం గుండా అత్యధిక సంఖ్యలో నౌకలు ప్రయాణించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. తాజాగా గల్ఫ్ నుంచి ఎల్పీజీతో వస్తున్న గ్రీన్ శాన్వీ ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్‌ను దాటింది. దీంతో ఇప్పటి వరకు కనీసం ఎనిమిది భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి.

సుమారు 46,650 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సరుకుతో గ్రీన్ శాన్వీ శుక్రవారం రాత్రి హోర్ముజ్ జలసంధిని దాటింది. హోర్ము జ్ సురక్షితంగా దాటిన నౌకలలో శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ శాన్వీ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ శాన్వీ భారత్‌కు రానుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గుజరాత్ మంత్రి హర్ష్ సంఘ్వీ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.