calender_icon.png 24 December, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైస్తవ సోదరీ సోదరమణులకు శుభాకాంక్షలు

24-12-2025 09:44:22 PM

మేడ్చల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్ర పరిధిలోని క్రైస్తవ సోదరి సోదరామణులకు ఏసుక్రీస్తు జన్మదినోత్సవం సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ మానవాళికి ప్రేమను కరుణను పంచిన క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో యేసుక్రీస్తు జన్మదినోత్సవం సందర్భంగా క్రిస్టియన్ లు ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉమ్మడి మేడ్చల్ మండల మున్సిపాలిటీ పట్టణ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పుర ప్రముఖులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.