15-01-2026 12:49:32 AM
ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్, జనవరి14:నారాయణఖేడ్ పట్టణంలోని ముస్లిం మైనార్టీ స్మశాన వాటిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణ పరిధిలోని ఐదు ఎకరాల వి స్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మైనార్టీ స్మశా న వాటికకు ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి భూ మిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మా ట్లాడుతూ, ఎంపీ నిధుల కింద మైనార్టీ స్మశా న వాటిక చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ము న్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసిందని, ఈ నిధులను స్థానిక అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించిన మౌలిక వసతుల అభి వృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. స్మశాన వాటిక వద్ద బోర్వెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మైనార్టీ షాదీఖాన నిర్మాణానికి రూ.50 లక్షల ప్రతిపాదన పంపించామని తెలిపారు. మున్సిపాలిటీలో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పను లు కొనసాగుతున్నాయని, పట్టణంలో లింక్ రోడ్ల ఏర్పాటుతో పాటు రోడ్ల అభివృద్ధి జరుగుతోందన్నారు. పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు అమృత్ 2.0 పథకం ద్వారా రూ.12 కోట్లు మంజూరు కాగా, అదనంగా రూ.2 కోట్లతో బోర్లు వేయడం ద్వారా నీటి సమస్యను తగ్గించామని తెలిపారు.
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి పెండింగ్లో ఉన్న నూతన కనెక్షన్లు ఇచ్చామని, నాలుగు నూతన ట్రాన్స్ఫార్మర్లు, 200 విద్యుత్ స్తం భాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఖేడ్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రె స్ హయాంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరా రు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రోటోకాల్ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ చైర్మన్, వైస్ చై ర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, దారం శంకర్, మాజీ కౌన్సిలర్లు వివేకానంద, హ న్మాండ్లు, మైనార్టీ నాయకులు రషీద్, తహేర్ అలీ, మైనోద్దీన్ ఖురేషి, సుబుర్, బారి, వాజీద్, అజీమ్, గౌస్ చిస్తీ, యునుస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధు లు, మైనార్టీ సంఘాల నాయకులు, అధికారులు, హాజరయ్యారు.