ఎల్లమ్మచెరువును టూరిజం స్పాట్‌గా మార్చుకుంటాం
- రాజీవ్ రహదారిపై ఫిష్ మార్కెట్
బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, జనవరి 14 (విజయక్రాంతి): సంవత్సరంలోపు ఎల్లమ్మ చెరువు ప్రాంతా న్ని టూరిజం గా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బుధవారం ఎల్లమ్మ చెరువు హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ను ప్రారంభించి ఎగరవేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. హుస్నాబాద్ ప్రజలకు భోగి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చే సంక్రాంతికి ఇక్కడ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకుందమన్నారు. మహా సముద్రం గండి, సర్దార్ పాపన్న గుట్టలు, భైరవ స్వామి గుడి, అర్బన్ పార్క్, రాయికల్ వాటర్ ఫాల్స్, ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ ఆలయం, పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం , కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం ,గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్ట్ తో హుస్నాబాద్ టూరిజం, ఉపాధి , విద్య, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకోవాలనీ కోరారు.
రహదారిపై ఫిష్ మార్కెట్ ....
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం చెరువులో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య అభివృద్ధి, స్టేట్ సెక్టార్ పథకం ద్వారా 100 శాతం రాయితీతో చెరువులలో రొయ్యపిల్లలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 47 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయనీ, వాటిలో 4144 మంది సభ్యు లు ఉన్నట్లు చెప్పారు.
166 చెరువులకు గాను 38 లక్షల 92 వేల చేప పిల్లలు విడుదలకు ప్రణాళికలు వేయగా ఇప్పటి వరకు 26 చెరువుల్లో 26 లక్షల 69 వేల 860 చేప పిల్లలు విడుదల చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో 2 చెరువులలో రూ.13.58 లక్షల విలువ గల 5 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయుటకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. శనిగరం రిజర్వాయర్ లో రూ.17.04 లక్షలతో 9.87 లక్షల చేప పిల్లలను వాడినట్లు తెలిపారు.
మచ్చ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటమని హామీ ఇచ్చారు. రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డు పై ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. కరీంనగర్ ,గోదావరి ఖని ఇతర జిల్లాల వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చి పోయే సమయంలో కొనుగోళ్ళు చేస్తారనీ చెప్పారు. బద్దిపడగ మీదుగా బ్రిడ్జి కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మీ నారాయణ, మత్స్య సొసైటీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.




