15-01-2026 12:49:14 AM
సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి
నాగర్ కర్నూల్, జనవరి 14 (విజయక్రాంతి): తరాలుగా వస్తున్న సాంప్రదాయ పండగలను కొనసాగిస్తూ ఒంగోలు జాతికి చెందిన వృషభ రాజులు బండలాగుడు పోటీలు నిర్వహించడం రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బుధవారం తన సతీమణి కూచుకుల్ల సరితతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగర్కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో నిర్హహించిన అంతర రాష్ట్ర ఒంగోలు జాతి వృషభ రాజుల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు.
ఒంగోలు జాతి పశువులు తెలుగు రైతుల గర్వకారణమని, ఈ జాతి పరిరక్షణకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. అనంతరం తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీపురం గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో జరిగిన గోదాదేవి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.