3 March, 2026 | 9:46 PM

రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

03-03-2026 12:00 AM

కోదాడ, మార్చి 2 : మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో మెయిన్ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ శిరీష వెంకట్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శిరీష వెంకట్ మాట్లాడుతూ మెయిన్ రెడ్డు గుంతలమయంగా మారిందని, రోడ్డు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు.

వెంటనే ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పద్మావతికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.