4 April, 2026 | 2:47 AM

మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన

04-04-2026 01:02 AM

తాడ్వాయి,మార్చి, 3( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో శుక్రవారం మహిళా సంఘ భవనం నిర్మాణానికి ప్రతినిధులు శంకుస్థాపన నిర్వహించారు. మహిళా సంఘ భవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది.ఈ నిధులతో భవన నిర్మాణానికి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళా సంఘ భవనం నిర్మాణం పూర్తి అవుతే మహిళలకు సమావేశాలు జరుపుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు గతంలో సరైన భవనం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి నాయకులు షౌకత్ అలీ, రాజీవ్ కుమార్, ఏఈ కల్పన తదితరులు పాల్గొన్నారు.