10 April, 2026 | 1:50 AM

హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకోవాలి

10-04-2026 12:17 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ అత్తమ్మ హెచ్‌ఐవి స్థితిని తెలుసుకోవాలని, ముఖ్యంగా వివాహానికి ముందు స్వచ్ఛందంగా హెచ్‌ఐవి పరీక్ష ఆవశ్యకత ఎంతో ముఖ్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ అన్నారు. ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ప్రజా పాలన  ప్రగతి ప్రణాలిక కార్యక్రమం కింద  గురువారం కొత్తగూడెంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీని డిఎం&హెచ్‌ఓ  లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ పాత డిపో నుండి ప్రారంభమై కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ర్యాలీ సందర్భంగా, విద్యార్థులు హెచ్‌ఐవి/ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి నినాదాలు చేశారు. సమాచార ఫలకాలను ప్రదర్శించారు.  అనంతరం, రైల్వే స్టేషన్లో ఒక సమావేశం నిర్వహించారు. 

అన్ని పిహెచ్సిలు, యుపిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్)లలో హెచ్‌ఐవి పరీక్షా సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి. ప్రసాద్, ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.