ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ
శంకుస్థాపన చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం, ఏప్రిల్ ౬ (విజయక్రాంతి): ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఈ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా ప్రముఖ వేద పండితుడు బాదంపూడి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
ఆలయ పునర్నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగటి శ్రీను, నాగటి ఉపేందర్, తుళ్లూరి మాధవరావు - కోటేశ్వరి దంపతులు, మద్దినేని ప్రసాద్, ఆళ్ల రమేష్, గద్దల నాగేశ్వరరావు, గద్దల చిన్నప్ప, తుళ్లూరి కృష్ణయ్య, కొల్పు వెంకటేశ్వర్లు, పందుల తిరుపతిరావు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




