3 July, 2026 | 8:24 PM

Breaking News

సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •   ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే   •   నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా   •  

వైభవంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ భూమిపూజ

07-03-2026 12:00 AM

కాగజ్‌గర్, మార్చి 6 (విజయక్రాంతి): పట్టణంలోని ఆర్‌ఆర్‌ఓ కాలనీలో శుక్రవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాల య పునర్నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవ క్త ఆచార్యులు అనంతశ్రీ విభూషిత త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి గోవింద క్షేత్రంగా నామకరణం చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు ముం దుకొచ్చి సహకారం అందిం చారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వా యి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.