7 March, 2026 | 6:36 PM

పక్కాగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

07-03-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, మార్చి 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాలన ప్రగతి ప్రణాళిక పక్కాగా అమ లు చేసినందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై పలు సూచనలు చేసినట్టు తెలిపారు.

99 రోజుల ఈ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని మంత్రికి విన్నవించారు అనంతరం జిల్లా  అధికారులతో ఈ కార్యక్రమంపై మాట్లాడారు జిల్లాల్లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ముధోల్ శాసనస భ్యులు పవార్ రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సోమ భీమ్ రెడ్డి, షిండే ఆనంద్ రావు పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.