11 March, 2026 | 3:21 PM

మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ

11-03-2026 01:45 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామంలో ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంచ  శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళా సమాఖ్య సభ్యుల సమావేశాలు మరియు వివిధ కార్యక్రమాలకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ తెలిపారు.

గ్రామంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు సావనపల్లి బాలయ్య, రోడ్ల సుకన్య, రేగుల రాజు, క్యారం పరుశురాములు, ముద ముత్తయ్య, బొనుగాని జమున, రేగుల రేఖ, కంకణాల లక్ష్మణ్, అంజయ్య, గర్రెపల్లి సర్వయ్య సెక్రటరీ  సంతోష్  తదితరులు పాల్గొన్నారు.