11 March, 2026 | 3:20 PM

హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి

11-03-2026 01:47 PM

– హిందూ జాగరణ్ మంచ్ పిలుపు

కాగజ్‌నగర్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలో నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ శోభాయాత్రను ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించాలని హిందూ జాగరణ్ మంచ్ నాయకులు పిలుపునిచ్చారు.పట్టణంలోని అగ్రసేన్ భవన్‌లో హిందూ జాగరణ్ మంచ్ క ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 2న పట్టణంలో నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

శోభాయాత్ర మార్గం, భద్రతా ఏర్పాట్లు, వాహనాల నిర్వహణ, భక్తుల పాల్గొనడం, స్వచ్ఛంద సేవకుల బాధ్యతలు వంటి అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. శోభాయాత్రను భక్తి భావంతో, శాంతియుతంగా మరియు ఘనంగా నిర్వహించేందుకు పట్టణంలోని హిందూ సంఘాలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో హిందూ జాగరణ్ మంచ్ నాయకులు, సభ్యులు మరియు పట్టణానికి చెందిన పలువురు హిందూ బంధువులు పాల్గొన్నారు.