15 June, 2026 | 10:22 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రామేశ్వర్‌పల్లిలో మహిళా సంఘ భవనానికి భూమిపూజ

26-03-2026 12:07 AM

భిక్కనూర్, మార్చి 25 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, విడిసి అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీంరెడ్డి, ఐకేపీ ఏపీఎం సాయన్న, సీసీ శ్రీనివాస్, విడిసి మాజీ అధ్యక్షులు తక్కల నర్సరెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ తక్కల్ల బాప్ రెడ్డి, మాజీ టెంపుల్ డైరెక్టర్ మామిడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందడి బాల్ రెడ్డి, ఏలేటి మోహన్ రెడ్డి, నాగరాజుతో పాటు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కార్యదర్శి శ్యామ్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.