15 June, 2026 | 11:28 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పెన్షనర్ల పాలిట శాపంగా వ్యాలిడిషన్ చట్టం

26-03-2026 12:07 AM

రాష్ట్ర పెన్షనర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య

కోదాడ, మార్చి 25: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడిషన్ చట్టం పెన్షనర్ల జీవితాల్లో అంధకారం నింపుతుందని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం పిలుపుమేరకు బుధవారం కోదాడలో ఈ చట్టానికి వ్యతిరేకంగా కోదాడ సంఘ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. 2026 జనవరి కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి డీఏ, పీఆర్సీ ప్రయోజనాలు ఉండవని చెప్పడం పెన్షనర్ల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ మేరకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనెపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు,అసోసియేట్ అధ్యక్షులు వి జానయ్య, ఉపాధ్యక్షులు గులాం ఎస్ దాని, భ్రమరాంబ, సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ శంబయ్య, ఈసీ మెంబర్ బాలేమియా, మణిరం తదితరులు పాల్గొన్నారు.