మండేపల్లి గ్రామంలో మహిళా స్వశక్తి సమాఖ్య భవనాలకు భూమిపూజ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మహిళా స్వశక్తి సమాఖ్యల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రియదర్శిని, శ్రీ చైతన్య, ఉజ్వల మహిళా గ్రూపులకు ఒక్కో భవనం కోసం రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయబడింది.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నేరల నర్సింగం గౌడ్, సర్పంచ్ సాగర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ టోనీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హారికా రెడ్డి, జిల్లా యూత్ నాయకుడు మునిగేల రాజు, గ్రామ ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.




