పదో తరగతి తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
14 మార్చి 2026 నుంచి 16 ఏప్రిల్ 2026 వరకు.
ఎంఈఓ పరిటాల వెంకటరమణ ప్రకటన.
చర్ల, (విజయక్రాంతి): చర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 10వ తరగతి పరీక్షలు(Tenth Class Public Exams ) ఈనెల 14 మార్చి 2026 నుంచి, 16 ఏప్రిల్ 2026 వరకు జరగనున్నాయని ఎంఈఓ పరిటాల వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిథి లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్దం చేసి నట్లు .మండలంలో మొత్తం 311 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 228 , సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 83 మంది వ్రాయనున్నారు .
ఇద్దరు చీప్ సూపర్నిడెంట్స్ ,ఇద్దరు డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ ,3 కస్టోడియన్స్ తో పాటు 19 మంది ఇన్విజిలేటర్స్ ని పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ నియమించిందని ప్రకటించారు . పరీక్ష కేంద్రాలలో త్రాగు నీటితో పాటు ,ఆరోగ్య కార్యకర్తలను నియమించి అన్నీ వసతులు కల్పించినట్లు తెలిపారు .సిసి కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నాయి . ప్రశాంత వాతావరణం లో పరీక్షలు జరిగేందుకు పోలీస్ వారి సహకారం తీసుకొంటున్నామని , పరీక్ష కేంద్రాల వద్ద ఇతర వ్యక్తులు సంచరించ రాదనీ ,పరీక్షా సమయం లో జీరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు .




