12 March, 2026 | 3:32 PM

భూగర్భ జలాలను సంరక్షించుకోవాలి

12-03-2026 12:00 AM

మేడ్చల్, మార్చి 11 (విజయ క్రాంతి):  భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని, నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జలవనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు.

 కేంద్రీయ భూగర్భ జల బోర్డు, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నదీ జలాల అభివృద్ధి గంగా పునరుజ్జీవ విభాగం ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లాలోని సంబంధిత శాఖల ఇంజ నీర్లు, క్షేత్ర, సాంకేతిక సహాయకులకు భూగ ర్భ జలాలను సంరక్షించుకోవడంపై నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

భూగర్భ జలాల  సంరక్షణకు సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారని వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో అమలు కావడానికి, కాపాడుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించి, నిర్వహించడానికి ప్రధానంగా ఈ శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి నదీ జలాలను ఒడిసి పట్టుకున్నట్టే, అంతరించిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, తదితర నిర్మాణాలు ఉపయోగపడతాయన్నారు.

శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఇలాంటి శిక్షణ కార్యక్రమంలో తెలుసు కున్న విషయాలు సద్వినియోగం చేసుకుని జిల్లాలో భూగర్భ జలాలను పెంచేందుకు   ఉన్నతాధికారులు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ ఈ సంద ర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిజిడబ్ల్యుబి శాస్త్రవేత్తలు డాక్టర్ పండిత్ మాతనూర్, మాధవ్, యాదయ్య, రాంబా బు, అమన్ జైన్, భూగర్భ జల శాఖ అధికారి హరీష్ ,సత్యనారాయణ, వంశీకృష్ణ, కార్తీక ప్రియ, కమల కుమారి, కార్తీక్, రాకేష్, పవన్ కుమార్ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాంబశివరావు, ఇతర శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.