12 March, 2026 | 3:34 PM

తెలంగాణ క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కోసం మండల స్థాయి ఎంపికలు

12-03-2026 12:00 AM

మండల విద్యాశాఖధికారి, అన్నపురెడ్డిపల్లి

అన్నపురెడ్డిపల్లి, మార్చి 11 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి  మండలం లో తెలంగాణ క్రీడా పాఠశాలలో 4 వ తరగతి ప్రవేశాల కోసం మార్చి 13 నుండి 17 వ తారీఖు వరకు మండల విద్యా వనరుల కేంద్రములో ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనంద కుమార్ తెలిపారు. 

ప్రస్తుతం 3 వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని ఈ ఎంపికలో పాల్గొనాలని తెలియజేశారు. తెలంగాణ క్రీడా పాఠశాలలు హకింపేట, మేడ్చల్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఉన్నాయని తెలిపారు. ఈ ఎంపికలను మండల విద్యాశాఖధికారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు సున్నం కృష్ణారావు, లకావత్ జయరాం, వ్యాయమ ఉపాధ్యాయులు శీలం శ్రీనివాస్, వగ్గేలా స్వాతి నిర్వహిస్తారు.