12 April, 2026 | 5:34 AM

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు

27-10-2024 07:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో వారం రోజులుగా కొనసాగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా 7 రోజులపాటు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఆదివారం సాయంత్రం 5 గంటలతో పూర్తయ్యాయి. 31,383 మంది అభ్యర్థులు  గ్రూప్-1 ఈ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా అభ్యర్థులు పరీక్షలకు హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు.