15 June, 2026 | 11:12 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

వందేమాతర గేయం సామూహిక గీతాలాపన

06-11-2025 07:20 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న(శుక్రవారం) ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ/ స్థానిక సంస్థల/ ఎయిడెడ్/ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమ సంబంధిత ఫోటోలు, వివరాలతో అదే రోజు సాయంత్రం ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.