06-11-2025 07:23:00 PM
రైతు సంఘం డిమాండ్..
నకిరేకల్ (విజయక్రాంతి): పత్తి కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతులకు బిల్లు చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కేతపల్లి మండల కేంద్రంలోని ఎన్ఎస్ఆర్ భవనంలో తెలంగాణ రైతు సంఘం నాలుగో మండల మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు సీనియర్ నాయకుడు ఏళ్ల అశోక్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పత్తి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ఎకరానికి ఏడు క్వింటాల పరిమితిని వెంటనే ఉపసంహరించుకోవాలి. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు చాలామంది ఉన్నారు; కాపాస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడం అన్యాయం,” అన్నారు.
రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర మహిళా రైతు సంఘం కన్వీనర్ కందాల ప్రమీల మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పంటనష్టం పరిహారం చెల్లించాలని కోరారు.తరువాత మండల రైతు సంఘం కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో బొజ్జ చిన్న వెంకులు, చింతపల్లి లూర్తు మారయ్య, లకపాక రాజు, కోటలింగయ్య, శ్రీను, చెరుకు సత్తయ్య, కర్ర బాలయ్య, గాదె సత్తిరెడ్డి, కూకుట్ల శోభన్, నీలం సైదులు, అయ్యన్న, శ్రీపతి, వెంకన్న, పెరిక మల్లయ్య, జటంగి పిచ్చయ్య, జటంగి ఎర్రయ్య, చౌడయ్య తదితరులు పాల్గొన్నారు.