20-12-2025 12:44:30 AM
కరీంనగర్ క్రైమ్ డిసెంబర్19(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కిసాన్ నగర్ రోడ్ నెంబర్ 5 డి లో పలు విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో మారి ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వీటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత అనంతుల రమేష్ కరీంనగర్ నగర ఏడీఈకి శుక్రవారం వినతి పత్రం అంద జేశారు. కిసాన్ నగర్ లో రోడ్ల నిర్మాణం వల్ల విద్యుత్ స్తంభాలు కిందికి వంగిపోయాయని తీగలు ప్రమాదకర స్థితిలో వేలాడుతున్నాయని అనంతుల రమేష్ వివరించారు. రాత్రి వేళల్లో వాహనదారులు ప్రజలు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను గమనించలేకపో తున్నారని ప్రమా దాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చేతులకు అందే స్థితిలో విద్యుత్తి గల ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో మారాయని రోడ్డుపై పడే అవకాశం ఉందని వాటి స్థానంలో 10 వరకు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు స్పందించి వెం టనే సరి చేయాలని తెలిపారు. దీంతో ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ స్పందించి విద్యుత్ స్తంభాలకు సంబంధించిన ఎస్టిమేషన్ తయారుచేసి కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే విద్యుత్ తీగలను సరిచేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యపై సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు ఏడిఈ శ్రీనివాస్ గౌడ్ కు అనంతల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.