28 July, 2026 | 12:35 AM

ఎంపీపీఎస్ పీఎంశ్రీ పాఠశాలకు పెరిగిన ఆదరణ

28-07-2026 12:00 AM

264 మంది విద్యార్థులతో రికార్డు నమోదు

కోనరావుపేట, జూలై 27 (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని ఎంపీపీఎస్‌పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు విషయంలో విశేష విజయాన్ని నమోదు చేసింది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు మొత్తం 264 మంది విద్యార్థులు చేరడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అత్యధిక విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలగా నిలిచింది.

ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజ్మీర మదన్లాల్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 193 మంది, ఎల్కేజీ, యూకేజీలో 71 మంది విద్యార్థులు నమోదు అయ్యారు. ముఖ్యంగా ఫ్రీ ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) విభాగంలో 71 మంది విద్యార్థుల నమోదు ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ స్థాయిలో విద్యార్థుల నమోదు జరగడం పాఠశాలపై తల్లి దండ్రుల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.

నాణ్యమైన విద్యాబోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆధునిక కంప్యూ టర్ ల్యాబ్, ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్స్, విద్యార్థులకు అనుకూలమైన ఆహ్లాద కరమైన వాతావరణం, రుచికరమైన మధ్యాహ్న భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు వంటి అంశాలే ఈ విజయానికి ప్రధాన కారణాలని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అజ్మీర మద న్లాల్ అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలపై పెరుగుతున్న తల్లిదండ్రుల విశ్వాసం : అజ్మీరా మదన్ లాల్,ప్రధానోపాధ్యాయులు 

ఎంపీపీఎస్‌పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పా టు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం పాఠశాల పీఎం శ్రీ పథకానికి ఎంపిక కావడంతో అదనపు సౌకర్యాలు కల్పించబడటమే కాకుండా, ఆట వస్తువులు, ఒక ఆయా మరి యు ఒక ఇన్స్ట్రక్టర్ను నియమించి విద్యార్థుల సంరక్షణ, నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అంది స్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యకలా పాలను సమర్థవం తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను చూసి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం పెంచుకుని తమ పిల్లలను పెద్ద సంఖ్యలో చేర్పించడం ఆనందంగా ఉంది.