28 July, 2026 | 12:39 AM

‘మోకిల’ భూములపై భూ బకాసురుల కన్ను!

28-07-2026 12:00 AM
  1. రంగారెడ్డి జిల్లాలో అడ్డూ అదుపు లేకుండా అసైన్డ్ భూముల ఆక్రమణలు 
  2. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
  3. అధికారుల మౌనం..  
  4. మోకిలలో వెలుగుచూసిన భారీ భూ దందా

రంగారెడ్డి/ శంకర్ పల్లి, జులై 27(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ప్రాధాన్య ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో భూబకాసురుల కన్ను ప్ర భుత్వ అసైన్డ్ భూములపై పడింది. తాజాగా శంకర్ పల్లి మండలం మోకిల గ్రామంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూమిని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష నా యకులు కలిసి సాగిస్తున్న అక్రమాల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది.

‘సర్వే నంబర్ 31’లో అసైన్డ్ భూమి కబ్జా యత్నం..

మోకిల గ్రామంలోని సర్వే నంబర్ 31 లో ఉన్న 2.20 ఎకరాల అసైన్డ్ భూమిని క బ్జా చేసేందుకు అధికార పార్టీకి చెందిన కొం దరు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. ఈ స్థలాన్ని చదును చేసి, అక్కడున్న చెట్ల ను నరికివేస్తూ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించే పనులు వేగవంతం చేశారు. గతంలో ఈ మి గులు భూమిని ప్రభుత్వ దవాఖాన, ఆటస్థ లం వంటి ప్రజా అవసరాల కోసం కేటాయించాలని మోకిల గ్రామ పంచాయతీ పా లకవర్గం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. కానీ, ప్రస్తుతం ఈ భూమి ధర కోట్లకు పడగలెత్తడంతో అక్రమార్కులు దీనిని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

రూ. 20 కోట్లకు పైగా ఎకరం ధర..

శంకర్ పల్లి, మోకిల ప్రాంతాలు ఐటీ కారిడార్కు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడి భూములు హాట్ కేకుల్లా మారాయి.బహిరంగ మార్కెట్లో ఎకరం ధర దాదాపు రూ. 20 కోట్లు పలుకుతోంది. దీంతో 2.20 ఎకరాల ఈ స్థలం విలువ రూ. 40-50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

చదును చేసేది మా మనుషులే..

స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ ఆక్రమణను అడ్డుకు నేందుకు ప్రయత్నించగా వారిపై పొలిటికల్ ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఒక మాజీ ఎమ్మె ల్యే  రంగంలోకి దిగి నేరుగా స్థానిక నాయకులకు ఫోన్ చేసి, ‘అక్కడ భూమిని చదును చేసేది మా మనుషులే... మీరు అడ్డుపడితే ఊరుకునేది లేదు‘ అంటూ హెచ్చరికలకు ది గడం స్థానికంగా పెద్దచర్చనీయాంశంగా మా రింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు జిల్లా స్థాయి నాయకులు సైతం రంగంలోకి దిగి అధికారులపై, స్థానికులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వివాదంలో ప్రస్తుత ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు, గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూడా ప్రవేశించినట్లు గ్రా మంలో వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రభు త్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ, పో లీస్ అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, చేవెళ్ల ఆర్డీవో, శంకర్ పల్లి తహసీల్దార్లకు స్పష్టమైన ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఆక్రమణల సుడిగుండంలో ‘రంగారెడ్డి’ అసైన్డ్ భూములు..

కేవలం మోకిల మాత్రమే కాకుండా, రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పేదలకు కేటాయించిన, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్ భూములు కనుమరుగవుతున్నాయి.పేద రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు అడ్డదారిలో సాదాబైనామాలు, బోగస్ పత్రాలు సృష్టించి రియల్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు.

పొలిటికల్  రియల్ ఎస్టేట్ నెక్సస్: 

అధికారంలో ఎవరు ఉంటే ఆ పార్టీ నాయకులు, డెవలపర్లు కుమ్మక్కై జీవోలు, మార్గదర్శకాలను పక్కనబెట్టి ప్రభుత్వ స్థలాలను లేఅవుట్లుగా మారుస్తున్నారు.ప్రజా అవసరాలకు దిక్కులేదు. పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పార్కులు, బస్ డిపోల నిర్మాణం కోసం స్థలాలు వెతికితే దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ స్థలాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండటంతో భవిష్యత్తు తరాలకు మిగిలేది శూన్యమేనని సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు  స్పందించాలి..

కోట్ల విలువైన మోకిల అసైన్డ్ భూమిని కబ్జాదారుల బారి నుండి తక్షణమే విడిపించి, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి, ఆటస్థలం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి, ఈ అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శంకర్ పల్లి ప్రజలు కోరుతున్నారు.