calender_icon.png 8 September, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులు

08-09-2025 01:33:31 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేని వని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఎస్. అంతిరామ్ నాయక్ పదవీవిరమణ మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయు డు అంకితభావంతో చేసిన సేవతోనే విద్యార్థికి, ఆ కుటుంబానికి తద్వారా దేశానికి ఏం తో మేలు జరుగుతుందని తెలిపారు.

ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ద డంలో ఉపాధ్యాయులు సఫలీకృతం అవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం తెలంగా ణ ఉద్యమకారుడు గుండా మనోహర్ తం డ్రి గుండ విఠల్రావు దశదిన కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో టి పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు న ర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు న ర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనం ద్ గౌడ్, రాంచందర్ , రాజ్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.