21 May, 2026 | 2:37 AM

టైటాన్స్ టాప్-2లో ముగిస్తుందా?

21-05-2026 01:14 AM

అహ్మదాబాద్, మే 20 : ఐపీఎల్ 19వ సీజన్‌లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం తమ హోంగ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడబోతోంది. టాప్ 2లో లీగ్ స్టేజ్‌ను ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్న గుజరాత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 18 పాయింట్లు సాధిస్తుంది. ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో 8 విజయా లతో రెండో స్థానంలో ఉంది. ఓడితే మాత్రం టాప్-2 నుంచి కిందకి పడిపోయే ప్రమాదం ఉంది.

ఎందుకంటే టాప్ 2లో నిలిస్తే తొలి క్వాలిఫైయర్ లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి ఒకవిధంగా గుజరాత్‌కు షాకే. వరుసగా ఐదు విజయాల తర్వాత అనూహ్యంగా ఓడిపోయింది. 248 పరుగుల టార్గెట్‌ను ఛే దించేందుకు పోరాడినా కీలక బ్యాటర్ల వైఫ ల్యం దెబ్బతీసింది. ఓవరాల్‌గా ఈ సీజన్ లో గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు.

టాప్ 5లో ఉన్న వీరిద్దరూ గుజరాత్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో బట్లర్, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపిస్తున్నారు. అటు బౌలింగ్‌లో సిరాజ్, రబాడతో పాటు జాసన్ హోల్డర్ అదరగొడుతున్నారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం ఫామ్‌లోకి రావడంతో గుజరాత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగు తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా ఇది చివరి మ్యాచ్.

గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు గుజరాత్ పై గెలవాల్సిందే. అప్పుడు కూడా ప్లే ఆఫ్ చేరు తుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే చెన్నైకి మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలు కూడా కలిసిరావాలి.  మొదట గుజరాత్ పై భారీ విజయం సాధిస్తే 14 పాయింట్లతో రన్‌రేట్ కూడా మెరుగవుతుంది. తర్వాత పంజాబ్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిపోవాలి. అలాగే రాజస్థాన్, కేకేఆర్ తలో రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా, ఢిల్లీ ఒక మ్యాచ్ ఆడనుంది.

ఈ మూడు జట్లు ఆడే ప్రతి మ్యాచులోనూ ఓడిపోవాలి. అదే సమయంలో 14 పాయింట్లు సమమైతే మాత్రం  రన్ రేట్ కీలకమవుతుంది. కాగా గత మ్యాచ్ లో సంజూతో సహా కీలక బ్యాటర్లు నిరాశపరిచారు. ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌లో అదరగొట్టకుంటే మాత్రం విజయం అందడం కష్టమే. బౌలింగ్‌లో  ము కేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ సత్తా చాటుతుంటే అన్షుల్ కాంబోజ్ భారీగా పరుగులి చ్చేస్తున్నాడు. 

తుది జట్ల అంచనా 

గుజరాత్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, హోల్డ ర్, షారూఖ్ ఖాన్,  తెవాటియా, రషీద్ ఖా న్, మానవ్ సుతార్, రబాడ, సిరాజ్

చెన్నై : సంజూ, రుతురాజ్(కెప్టెన్), కార్తీక్, బ్రెవిస్, ప్రశాంత్, అన్షుల్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్, గుర్జప్‌నీత్ సింగ్