ఈక్వెస్ట్రియన్‌లో అదరగొడుతున్న షెహనవాజ్
హైదరాబాద్, మే 21: క్రీడారాజధాని హైదరాబాద్ హార్స్ పోలో, ఈక్వెస్ట్రియన్ వంటి క్రీడల్లోనూ ఛాంపియన్లకు వేదికగా నిలుస్తోంది. హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవలే జరిగిన ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్ 2026 పోటీల్లో యువ రైడర్లు అదరగొట్టారు. ఈ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అమీర్ షెహనవాజ్ అగ్రస్థానం సాధించాడు. షో జంపింగ్ 105 సెం.మీ ఓపెన్ కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే జంపింగ్ 110 సెం.మీ కేటగి రీలో రెండో స్థానంలో నిలిచాడు.
హెచ్‌పీఆర్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 13 ఏళ్ల షెహన వాజ్ బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్ లో చదువుతున్నాడు. చిన్ననాటి నుంచే ఈక్వెస్ట్రియన్‌పై ఆసక్తి కనబరచడంతో తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. కొయంబ త్తూరుకు చెందిన ప్రముఖ కోచ్ సెంథిల్, హైదరాబాద్‌కు చెందిన మహేశ్ శిక్షణలో ఈక్వెస్ట్రియన్‌లో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హైదదారా బాద్ పోలో రైడింగ్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తూ 13 ఏళ్లకే జూనియర్ స్థాయి పోటీల్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.
జంపింగ్ జూనియర్ 105 సెం.మీ (ఓపెన్) : 1. మహ్మద్ అమీర్ షెహనవాజ్ (హెచ్‌పీఆర్‌సీ) స్వర్ణం , 2. మహ్మద్ అ మాల్ అలీ (రాచో ది కబాల్లాస్) రజతం, 3. శివసాయి (రుటా) కాంస్యం
జంపింగ్ టేబుల్ సి(105 సెం.మీ) : 1. అమోఘ్ వర్ష దాట్ల (హెచ్‌పీఆర్‌సీ) స్వర్ణం, 2. మహ్మద్ అమీర్ షెహన వాజ్ ( హెచ్‌పీఆర్‌సీ) రజతం, 3. మహ్మ ద్ అమాన్ అలీ(రాచో ది కబాల్లాస్) కాంస్యం






