చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్
30-07-2026 12:25 AM
10 వేల మీటర్ల పరుగులో రజతం
గ్లాస్గో, జూలై 29 : భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో 10 వేల మీటర్ల పరుగులో రజతం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. జాతీయ రికార్డు హో ల్డరైన గుల్వీర్ ఈ ఫైనల్ రేసును 27:49.8 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచా డు. ఈ రేసులో అగ్రశేణి ఆఫ్రికన్ రన్నర్లతో పోటీ పడుతూ గుల్వీర్ అత్యంత వ్యూహాత్మకంగా ముందం జ వేశాడు. కామన్‌వెల్త్ గేమ్స్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో 1986 తర్వాత ఆఫ్రికేతర ఆటగాడు పోడియంపై నిలవడం ఇదే మొదటిసారి.






