30 July, 2026 | 1:23 AM

ఐపీఎల్ @ రూ. 1,91,000 కోట్లు

30-07-2026 12:27 AM
  1. 11.4 శాతం పెరిగిన లీగ్ వాల్యూ
  2. 300 బిలియన్ డాలర్లతో ఆర్‌సీబీ టాప్

ముంబై, జూలై 29 : ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ సీజన్‌కూ లీగ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్ అరుదైన మైలురాయి చేరుకుంది. లీగ్ విలువ రూ.1,91,000 కోట్లు (20 బిలియన్ డాల ర్లు) దాటిపోయింది.యూఎస్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ 20 26 ఐపీఎల్ వాల్యుయేషన్ స్టడీ ఈ నివేదిక వెల్లడించింది. 2023లో 15.4 బిలియన్ డా లర్లుగా ఉన్న ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024 లో 16.4 బిలియన్ డాలర్లు,

2025లో 18.5 బిలియన్ డాలర్లకు పెరిగి, ఇప్పుడు 20.6 బిలియన్ డాలర్లను చేరుకుంది. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలతో కలిపి 2026 సీజన్ ఆదాయం 1.8 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే లీగ్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది.  ఆర్సీబీ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగి 312 మిలియన్ డాలర్లకు చేరింది.