17 July, 2026 | 8:54 AM

గుంటి పిచ్చయ్య వరల్డ్ రికార్డు

01-07-2025 02:42 AM

గిన్నిస్‌లో బుక్‌లో స్థానం 

మఠంపల్లి, జూన్ 30: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రా నికి చెందిన కళా ప్రపూర్ణ నట డాక్టర్ గుంటి పిచ్చయ్య గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఈటా ప్రాంతంలో సాంస్కృతిక కళా ప్రదర్శనలో దాదాపుగా 1,326 మంది కళాకారులు 24 గంటల పాటు అతిపెద్ద కళా ప్రదర్శనలో లావళినృత్యం ను మహారాష్ట్ర కు చెందిన సాంప్రదాయ గీతానికి నృత్య రూపకాన్ని డ్రం, డోలక్ దరువులకు అనుగుణంగా ప్రదర్శించారు.

దీనికి క్యాస్ట్యు మ్స్, ఆర్గనైజేషన్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు.  కాగా రికార్డు సాధించిన గుంటి పిచ్చయ్యను తెలంగాణ రాష్ట్ర జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అభినందించి, ఘనంగా సత్కరించారు. పలువురు నాయకులు, ప్రముఖులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహ కులు అభినందనలు తెలియజేశారు.