01-07-2025 02:41:07 AM
-సాంస్కృతిక కార్యక్రమాల నివేదిక
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): డిస్నీల్యాండ్ పాఠశాలలో ఆదివారం క్రియేటివ్ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులలోని సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రత్యేక ఆకర్షణగా తరగతి గదిలో తలరాతను మార్చే గురువులారా పాటతో ప్రఖ్యాతి గాంచిన గీత రచయిత, గాయకుడు రామంచ సుమన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. యాజమాన్యం ఆయనను ఆత్మీ యంగా సత్కరించి, ఆయన చేత పాటలు పాడించి విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. విద్యార్థులంతా తమ ప్రతిభను బహిర్గతం చేస్తూ నృత్యాలు, పాటలు, మిమిక్రీ వంటి కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొన్నారు.