01-07-2025 02:42:55 AM
శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): చికిత్స కంటే నివారణే ఉత్తమం, సురక్షితం అని శ్వాస ఫౌండేషన్ చైర్మన్(శ్వాస హాస్పిటల్) డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని అన్నారు. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆయన గొప్ప వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు.
ఈ సందర్భంగా డాక్టర్ విష్ణున్‌రావు మాట్లాడుతూ.. శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలను గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు సాధికారతనిస్తూ, వైద్యులకు మద్దతునిస్తూ, ఆరోగ్యం హక్కు కాదు ఆచరణ కావాలి అనే దిశ గా కార్యాచరణ చేపడుతున్న ట్టు వెల్లడించారు.
వైద్యుల గురించి మా ట్లాడుతూ.. భారతదేశంలో వైద్యులు కేవలం రోగ నిరోధకులు , చికిత్సలు చేసే వారు మాత్రమే కాదు వారు సమాజ శ్రేయస్సు కోసం నిలబడాల్సిన మూల స్తంభాలు , విద్యావేత్తలు, మార్పు కాంక్షించే వ్యక్తులు అని కొనియాడారు. వైద్యులు, పాలకులు, ఎన్జీవో సం ఘాలు, ప్రజలు అందరూ కలిసి నిర్మించేదే ఆరోగ్యవంతమైన సమాజం అని చెప్పారు.