calender_icon.png 2 November, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యాసంస్థల పూర్వ వైభవానికి గురుకుల పరిరక్షణ సమితి ముందడుగు

02-11-2025 04:37:17 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ గురుకుల విద్యాసంస్థల పూర్వ వైభవం తీసుకురావడానికి గురుకుల్ పరిరక్షణ సమితి ముందడుగు వేసిందని స్థానిక నాయకులు పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు. ఆదివారం ఘట్ కేసర్ లో గురుకుల పరిరక్షణ సమితి సమావేశం జరిగింది. సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. గురుకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థిని, విద్యార్థులకు నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను, పురోగతులను ఇక ముందు చేయాల్సిన పనుల గురించి చర్చించడం జరిగింది. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతులను పరిశీలించడం జరిగింది.

రైల్వే గేట్ దగ్గర అసంపూర్తిగా మిగిలిన కాంపౌండ్ వాల్ ను అక్కడి నుంచి వచ్చే దారిని మూసివేయుటకు ఇనుప కంచె వేయుటకు దాత కందకట్ల మాధవరెడ్డి ముందుకురావడం  అభినందనీయమని గురుకుల పరీక్ష సమితి కన్వీనర్ అంకం సురేష్ కుమార్ యాదవ్ మాధవ రెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి మాజీ ఎంపిటిసి డి. రఘు రూ. 5వేలు, పూర్వ విద్యార్థి మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ రూ. 5వేలు, పూర్వ విద్యార్థులు ఎం.ఏ ఖలీల్ 1000 లీటర్ల వాటర్ ట్యాంక్, చుక్కల రవిశంకర్ 1000 లీటర్ల వాటర్ ట్యాంక్, చిలుగూరి వెంకటేష్ రూ. 10వేలు, రామలింగేష్ రూ. 1000, పన్నీర్ గంగాధర్  రూ.1000 నిర్మాణ పనులకు సహాయం అందించారు. ఈ సందర్భంగా గురుకుల్ పరిరక్షణ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక దాతలు ముందుకు వచ్చి నిర్మాణ పనులు పూర్తి చేయుటలో భాగస్వామ్యం కావాలని గురుకుల్ పరిరక్షణ సమితి విన్నవించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.