calender_icon.png 3 November, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి

02-11-2025 04:40:53 PM

దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల ఎంపిక శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్‌ (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి వారు అడగకముందే సహాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఇండోర్ స్టేడియంలో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్ రెడ్డి కుటుంబం, గుడి గోపురం మట్టా రెడ్డి కుటుంబం ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమం సంతోషంగా ఉందన్నారు. 

సమాజంలో సేవ భావన పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని, సుమారు 150 మంది దివ్యాగులకు కృతిమ పాదాలు పంపిణీ చేయుటకు ఆదివారం నిర్వాహకులు దివ్యాంగుల యొక్క పాదాల కొలతలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో దివ్యాంగులు హాజరై కృత్రిమ పాదాల కొలతలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, నాయకులు ప్రశాంత్, జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం, నిర్వాహకులు కలకొండ సంపత్, ఎదిరి ప్రమోద్ కుమార్, సాంబశివరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.