02-11-2025 03:26:05 PM
జడ్చర్ల: పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు మాజీ మార్కెట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్నచెందుతూ అస్వస్థతో మృతి చెందారు. మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యన్న అకాల మరణం పట్ల జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ విచారం వ్యక్తం చేశారు. అయ్యన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ. భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని అయ్యన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. అయ్యన్న మృతి కల రంగానికి తీరని లోటని రంగస్థల కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి సంఘం నాయకులు, పట్టణ ప్రజలు, ప్రముఖులు అయ్యన్న మృతదేహం దగ్గర నివాళులర్పించారు.