25 April, 2026 | 10:34 AM

గురుకుల బాట నివేదిక కేసీఆర్‌కు అందజేత

09-12-2024 02:25 AM

* కేసీఆర్‌ను కలిసిన ఆర్‌ఎస్పీ, బాల్క

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి):  రాష్ర్టంలో గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులపై బీఆర్‌ఎస్వీ చేపట్టిన గురుకుల బాట విజయవంతమైంది. సంక్షేమ, వసతి గృహాల పరిస్థితులపై ఫైవ్‌మెన్ కమిటీ చైర్మన్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో జిల్లాల్లో పర్యటించింది. 9 రోజులుగా బీఆర్‌ఎస్వీ విద్యార్థి నాయకులు  క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు. ఆదివారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి నివేదికను అందజేశారు. కార్యక్రమంలో బాల్క సుమన్, డా.ఎర్రోళ్ల శ్రీనివాస్, డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నివేదికలో ఉన్న గురుకుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేలా అసెంబ్లీలో చర్చించాలని కోరారు.