25 April, 2026 | 3:55 AM

ముత్తోజిపేటలో టెన్ష న్

25-04-2026 02:31 AM
  1. కంచన్‌బాగ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ కన్నుమూత
  2. భారీ బందోబస్తు మధ్య ముత్తోజిపేటకు పార్థివదేహం
  3. నర్సంపేట డిపో వద్దకు తరలింపునకు తీవ్రయత్నం
  4. పరిస్థితి ఉద్రిక్తం.. నిలువరించిన పోలీసులు
  5. రూ.10 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించిన ప్రభుత్వం.. ఎమ్మెల్యే మాధవరెడ్డి రూ. 5 లక్షల సాయం..

మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మనస్థాపానికి గురై వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట గురువా రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ కంచన్‌బాగ్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఈ సంఘటన ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర కలకలం రేపింది. కంచన్‌బాగ్‌లోని అపో లో ఆసుపత్రిలో వైద్య నిపుణుల సమక్షంలో శంకర్‌గౌడ్ పార్థివదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు శంకర్‌గౌడ్ పార్థివదేహాన్ని భారీ బందోబస్తు మధ్య అంబులెన్స్‌లో నేరుగా శంకర్‌గౌడ్ స్వగ్రామమైన నర్సంపేట మండలం ముత్తోజిపేటకు తీసుకొచ్చారు.

అయితే ఆర్టీసీ కార్మి కులు, విపక్ష పార్టీల నేతలు శంకర్‌గౌడ్ పార్థీవదేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట కొంతసేపు ఉంచి, నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టారు. భారీగా మోహరించిన పోలీసులు అందుకు నిరాకరించారు. అయితే శం కర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు నర్సంపేటకు తరలివస్తున్నారని తెలుసుకున్న వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకా శాలు ఉన్నాయని పోలీసులను అప్రమత్తం చేశారు.

దీంతో నర్సంపేటకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సం ఘాల నేతలు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ని నర్సంపేట పట్టణానికి కొద్ది దూరంలోని మహేశ్వరం వద్ద అడ్డుకున్నారు. కాన్వాయ్‌తో కాకుండా కేవలం ఒక వాహనంలోనే వెళ్లాలని పోలీసులు కోరగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్‌గౌడ్ పార్థివదేహాన్ని సందర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకో వడం సరికాదని పోలీసుల తీరును మంత్రి తప్పుపట్టారు.

చివరకు పోలీసులు మంత్రి సంజయ్‌ని ముత్తోజిపేట వెళ్లడానికి అనుమతించడంతో ఆయన ముత్తోజిపేటకు చేరుకొ ని శంకర్‌గౌడ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ స భ్యులను పరామర్శించారు. అనంతరం శంకర్‌గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డి పో ఎదుట కొంతసేపు ఉంచడానికి ప్రయత్నించారు. ఇంటి నుంచి ఆయన శవపేటి కను కొంతదూరం తీసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు.

నర్సంపేటకు తీసుకెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో 22 సంవత్స రాల పాటు ఆర్టీసీ డ్రైవర్‌గా సేవలందించిన శంకర్‌గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్ద కొంతసేపు ఉంచి, అనంతరం అంతేక్రియలు నిర్వహిస్తే ఇబ్బంది ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీల నాయకులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది.

దాదాపు గంటపాటు అక్కడే రాస్తారో కో నిర్వహించారు. ఫలితంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎండ తీవ్రత, నర్సంపేట జాతీయ రహదారిపై రాకపోకలు నిలి చిపోవడం, సమయం గడిచే కొద్ది ఉద్రిక్తత పెరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు శంకర్‌గౌడ్ మృతదేహాన్ని బలవంతంగా తిరిగి ఇంటికి చేర్చారు.

దీనితో ఆర్టీసీ జేఏసీ, శంకర్‌గౌడ్ కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చ ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రకటించడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఉద్రిక్తతకు తెరపడింది. ఆర్టీసీ డ్రైవ ర్ కోలా శంకర్‌గౌడ్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నర్సంపేట బంద్‌కు పిలుపు ఇచ్చింది. దీనితో నర్సంపేట పట్టణం సంపూర్ణంగా బందు పాటిం చింది.

దిగొచ్చిన ప్రభుత్వం

కోలా శంకర్‌గౌడ్ ఘటనలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో ప్రభు త్వం దిగొచ్చింది. ఆర్డీఓ ఉమారాణి ముత్తోజిపేటకు చేరుకొని ప్రభుత్వం తరఫున శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పి స్తామని ప్రకటించారు. అలాగే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూ డా వ్యక్తిగతంగా రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూ రు చేస్తామని ప్రకటించారు.