25 April, 2026 | 11:28 AM

Kavitha New Party: ముఖ్యమంత్రి అయ్యి తీరుతా.. కవిత సంచలన ప్రకటన

25-04-2026 09:51 AM

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో నేడు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ(Kalvakuntla Kavitha New Party) ఆవిర్భావ సభ జరగనుంది. పార్టీ ప్రకటన సభకు ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar) ప్రాంగణంగా నామకరణం చేశారు.  బంజారాహిల్స్ లోని నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కవిత నివాసంలో సర్వమత ప్రార్థనల తర్వాత భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి బంజారాహిల్స్ నివాసం నుంచి కవిత ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారు. అమరవీరుల స్తూపం వద్ద కవిత నివాళులర్పించారు.

అమరవీరుల స్తూపం వద్ద నుంచి కవిత సభకు ర్యాలీగా బయల్దేరారు. మునీరాబాద్ సభలోనే కవిత కొత్త పార్టీ(Kavitha New Party Name) పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ చేయనున్నారు. క్యాడర్, అతిథులకు 34 తెలంగాణ రుచులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  కవిత మాట్లాడుతూ... తెలంగాణ కొత్త విప్లవం వస్తుందని చెప్పారు. కచ్చితంగా వందశాతం ముఖ్యమంత్రి(Telangana Chief Ministe ) అయ్యి తీరుతానని తెలిపారు. అందుకు కవిత తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.  నూతన పార్టీ ఆవిర్భావ సభకు పాదయాత్ర, ఎండ్లబండ్ల యాత్ర, ట్రాక్టర్ యాత్రల ద్వారా భారీ ఎత్తున తరిలివస్తున్న ప్రజలకు, జాగృతి కార్యకర్తలకు కవిత స్వాగతం పలికారు.