పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి టీఆర్టీఎఫ్ మద్దతు
09-12-2024 02:21 AM
* కౌన్సిల్ సమావేశంలో నేతల తీర్మానం
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి టీఆర్టీఎఫ్ టీచర్ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, ఎం అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ అధికార అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు తీర్మానించినట్టు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ మద్దతు కాపీని పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డికి అందజేసినట్టు తెలిపారు.






