21 June, 2026 | 5:36 PM

బీఆర్ఎస్ పార్టీలో చేరిన గుత్పాల గ్రామస్తులు

21-06-2026 04:19 PM

బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని గుత్పాల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది యువకులు గ్రామ పెద్దలు ఆదివారం స్థానిక శాసనసభ్యులు అనిల్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పార్టీకి కార్యకర్తలే ప్రధానమని వారితోనే పార్టీ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రాథోడ్ సురేందర్, సోమేశ్ సుఖిల్ సబ్వే సంతోష్ బాబులాల్ కైలాస్ తదితరులు ఉన్నారు