6 May, 2026 | 1:25 AM

బండిపై మండి పడ్డ జీవీ..

06-05-2026 12:09 AM

మనకొండూర్, మే 5 (విజయక్రాంతి): బండి సంజయ్ కుమార్   కే.టి. రామారావు (కేటీఆర్ రిపై చేసిన అవమానకర , అనుచిత వ్యాఖ్యలను భరత్ రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణా రావు తీవ్రంగా ఖందించారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం అన్నారు.కేటీఆర్ కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)  కుమారుడని నిరూపించుకోవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవన్నారు.

హైదరాబాద్లో భూకబ్జా వ్యవహారాలపై కేటీఆర్  చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక, అలాగే రేవంత్ రెడ్డి తో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై స్పందించలేక, బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన అసహనాన్ని,బలహీనతను బయట పెడుతోందన్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై బండి సంజయ్ ఎన్నోసార్లు ఆరోపణలు చేసినప్పటికీ, కేటీఆర్  ఎప్పుడూ ధైర్యంగా సమాధానాలు ఇచ్చారు.

కానీ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ వ్యక్తిగత దూషణలకు దిగడం దురదృష్టకరమన్నారు.హిందూ ధర్మం, శ్రీ రాముడు, హనుమంతుడు పేర్లు ఎత్తుకునే బండి సంజయ్ వంటి నాయకుడు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ , అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  వంటి సంస్థల్లో ఆయనకు ఇదే శిక్షణ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందన్నారు.

మేము నిజమైన హిందువులం. మా సంస్కృతి గౌరవాన్ని, నియంత్రణను, నైతిక విలువలను నేర్పుతుంది. మేము దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, భక్తితో పూజిస్తామన్నారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, అలాగే కరీంనగర్  ఎంపీగా బండి సంజయ్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఇలాంటి బాషా తనపై వాడితే ఎలా ఉంటుందో బండి సంజయ్ ఆలోచించాలన్నారు.

యూరియా కొరత వంటి అత్యవసర సమస్యలపై కేంద్రంతో చర్చించి పరిష్కారం తీసుకురావడం కూడా చేయలేకపోయారన్నారు. >పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, బీజేపీ నాయకులు నిశ్శబ్దంగా ఉండటం బాధ్యతారాహిత్యం.కాదా అన్నారు.